Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కైమ్‌గంజ్‌లో స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఓ బాలికకు మార్గమధ్యంలో కుక్క కనిపించింది. దీంతో భయపడిన బాలిక కుక్క నుంచి తప్పించుకునే క్రమంలో సమీపంలోని సుమారు 40 అడుగుల లోతైన బావిలోకి దూకింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుక్కను చూసిన భయంతో బాలిక తీసుకున్న నిర్ణయం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
బాలిక బావిలో పడిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సహాయక బృందాలకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది చాకచక్యంగా చర్యలు చేపట్టి బాలికను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం బాలిక పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Loading Tweet...




















