హైదరాబాద్, ఆగస్టు 8 (జనవాణి): హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోడ్ నంబర్–11లో ఉన్న బీఆర్కే న్యూస్ భవనం సెల్లార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
భవనం సెల్లార్‌లో ఉన్న దారువాలా వైన్ మార్ట్ స్టాక్ స్టోరేజీలో మంటలు వ్యాపించడంతో భారీ మొత్తంలో మద్యం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మంటల కారణంగా భవనంలో చిక్కుకున్న 11 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం నాలుగు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Loading Tweet...




















