ఒడిశా కటక్ August 26(జనవాణి): ఒడిశాలోని కటక్ జిల్లా బంకీ సమీపంలో ఓ బాలుడు అడవి పందితో సాహసోపేతంగా పోరాడిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
కాలువలో స్నానం చేస్తుండగా..
14 ఏళ్ల బాలుడు కాలువలో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా అడవి పంది అతడిపై దాడి చేసినట్లు సమాచారం. ఊహించని దాడితో బాలుడు ఒక్కసారిగా షాక్‌కు గురైనప్పటికీ.. ప్రాణాలను కాపాడుకునేందుకు అడవి పందిని ఎదుర్కొన్నాడు.
దాదాపు రెండు గంటల పాటు పోరాటం
బాలుడు భయపడకుండా దాదాపు రెండు గంటల పాటు అడవి పందితో పోరాడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలుడు తీవ్రంగా ప్రతిఘటిస్తూ దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించాడు.
చివరకు స్థానికులు రక్షించారు
బాలుడు, అడవి పంది మధ్య పోరాటాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని జోక్యం చేసుకున్నారు. అనంతరం బాలుడిని అడవి పంది నుంచి రక్షించినట్లు సమాచారం.




















