#Floods

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Floods.

29 Stories

Stories tagged with #Floods

రోడ్డుపై వరద నీరు.. అందులో మొసలి ప్రత్యక్షం, షాకైన స్థానికులు
international,news

రోడ్డుపై వరద నీరు.. అందులో మొసలి ప్రత్యక్షం, షాకైన స్థానికులు

భారీ వర్షాలతో బ్యాంకాక్‌లోని ఓ నివాస ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. ఈ క్రమంలో మోకాలి లోతు నీటిలో ఓ మొసలి ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు పిల్లలు, పెద్దలు కలిసి కర్రల సాయంతో దాన్ని జనావాసానికి దూరంగా తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

30 సెప్టెం, 20261 min read
బ్యాంకాక్‌లో వరద బీభత్సం.. 3 రోజుల్లో 30 సెం.మీ. వర్షం, రోడ్లన్నీ జలమయం!
international,world,news

బ్యాంకాక్‌లో వరద బీభత్సం.. 3 రోజుల్లో 30 సెం.మీ. వర్షం, రోడ్లన్నీ జలమయం!

Bangkok Floods: బ్యాంకాక్‌లో భారీ వర్షాలతో వరదలు బీభత్సం సృష్టించాయి. 3 రోజుల్లో 30 సెం.మీ.కు పైగా వర్షంతో ఇళ్లు, కార్లు నీటమునిగాయి. రోడ్లు జలమయం కాగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

28 సెప్టెం, 20262 min read
Social Media Image
international,news

వరదల్లో చిక్కుకుని 9 రోజులు..నేపాల్ టన్నెల్ నుంచి ఇద్దరు సిబ్బంది సేఫ్

నేపాల్‌లో వరదల కారణంగా టన్నెల్స్‌లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పురోగతి నమోదైంది. త్రిశూలీ త్రీఏ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ టన్నెల్‌లో 9 రోజులుగా చిక్కుకుపోయిన ఇద్దరు సిబ్బందిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. దీంతో టన్నెల్స్‌లో చిక్కుకున్న మిగిలిన వారిని కూడా రక్షించవచ్చన్న ఆశలు పెరిగాయి.

4 సెప్టెం, 20261 min read
టిబెట్‌లో భారీ భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రత
international,news

టిబెట్‌లో భారీ భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రత

టిబెట్‌లో గురువారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రత నమోదైన ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) వెల్లడించింది.

3 సెప్టెం, 20261 min read
X Image
international,national,news,india

భారత్‌ ఎప్పుడూ మాకు అండగానే ఉంది.. నేపాల్ ఆరోగ్య మంత్రి ప్రశంసలు

భారీ వరదలతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్‌కు భారత్‌ అందిస్తున్న సహాయంపై ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి నిషా మెహతా ప్రశంసలు కురిపించారు. కష్టసుఖాల్లో భారత్‌ ఎప్పుడూ నేపాల్‌కు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. వరదల్లో మృతి చెందిన వారి గుర్తింపునకు డీఎన్‌ఏ పరీక్షల విషయంలో భారత్‌ నిపుణుల బృందం అందిస్తున్న సహకారం ఎంతో కీలకంగా మారిందని తెలిపారు.

2 సెప్టెం, 20262 min read
నేపాల్ వరద బాధితులకు సోనూసూద్ అండ..బాధితులను పరామర్శించిన రియల్ హీరో
national,news,international

నేపాల్ వరద బాధితులకు సోనూసూద్ అండ..బాధితులను పరామర్శించిన రియల్ హీరో

నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, ఆకస్మిక వరదలతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులకు అండగా నిలిచేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఖాఠ్మాండూకు వెళ్లారు. తీవ్రంగా ప్రభావితమైన త్రిశూలి బజార్‌ను సందర్శించి స్థానికులను కలుసుకుని పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.

2 సెప్టెం, 20262 min read
Social Media Image
international,news

హిమాలయాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు.. ఫ్లాష్‌ ఫ్లడ్స్‌పై నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలే నేపాల్‌లో సంభవించిన భారీ ఫ్లాష్‌ ఫ్లడ్స్‌కు ప్రధాన కారణమని ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా తెలిపారు. హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీల మేర పెరిగాయని వెల్లడించారు.

2 సెప్టెం, 20261 min read
X image
international,news

నేపాల్‌లో జలవిలయం.. వెయ్యి దాటిన మృతుల సంఖ్య..4,700 మందికిపైగా గల్లంతు

నేపాల్‌లో గతవారం సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియల విరిగిపడటంతో భారీ ప్రాణనష్టం చోటుచేసుకుంది. అధికారిక లెక్కల ప్రకారం నేపాల్‌లో 987 మంది, టిబెట్‌లో 16 మంది మృతి చెందగా.. 4,700 మందికిపైగా గల్లంతయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.

1 సెప్టెం, 20261 min read
X Image
news,international

నేపాల్ వరదలకు అసలు కారణం ఇదేనా? డ్రోన్ కెమెరాలో చిక్కిన భయానక దృశ్యాలు

నేపాల్‌లో ఆగస్టు 26న సంభవించిన మెరుపు వరదలకు కారణమైన భారీ మంచు గడ్డ విరిగిపడిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. చైనాకు చెందిన ఫోటోగ్రాఫర్ డ్రోన్ కెమెరాలో అనుకోకుండా రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

31 ఆగ, 20261 min read
The pressjournal Image
international,news

వరద ముంచెత్తేలోపే మాస్టర్ ప్లాన్.. 1643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్‌మాస్టర్

నేపాల్‌లో భారీ వరదల వేళ ఓ హెడ్‌మాస్టర్ చూపిన సమయస్ఫూర్తి 1643 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడింది. వరద ముప్పు ఉందని సమాచారం అందుకున్న వెంటనే ఉపాధ్యాయులను అప్రమత్తం చేసి, విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పిల్లలు సురక్షిత ప్రాంతానికి చేరుకున్న కొద్ది నిమిషాలకే స్కూల్ పరిసరాలను వరద నీరు ముంచెత్తింది.

30 ఆగ, 20261 min read
టీ బ్రేక్.. 28 మంది ప్రాణాలు కాపాడింది! నేపాల్‌ వరదల నుంచి బయటపడిన యాత్రికులు
andhra-pradesh,india,national,news,telangana

టీ బ్రేక్.. 28 మంది ప్రాణాలు కాపాడింది! నేపాల్‌ వరదల నుంచి బయటపడిన యాత్రికులు

నేపాల్‌ వరదల్లో చిక్కుకుని తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ 28 మంది కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రికులు శనివారం స్వస్థలాలకు చేరుకున్నారు. కేవలం పది నిమిషాల ఆలస్యం, టీ తాగేందుకు తీసుకున్న చిన్న విరామం తమ ప్రాణాలను కాపాడాయని వారు తెలిపారు.

30 ఆగ, 20262 min read
Social Media Image
international,news

నేపాల్ వరదల్లో 734 మృతదేహాలు వెలికితీత..గుర్తుతెలియని మృతదేహాల ఖననం

నేపాల్‌ను కుదిపేసిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటివరకు సుమారు 734 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీయగా.. గుర్తుతెలియని, ఎవరూ క్లెయిమ్ చేయని మృతదేహాలను ఖననం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

30 ఆగ, 20262 min read
Social Media Image
india,national,news

చిత్రకూట్‌ను ముంచెత్తిన వరదలు.. ఉగ్రరూపంలో మందాకిని నది

ఉత్తరప్రదేశ్–మధ్యప్రదేశ్ సరిహద్దులోని చిత్రకూట్, సత్నా జిల్లాలను భారీ వరదలు ముంచెత్తాయి. మందాకిని నది ఉగ్రరూపం దాల్చడంతో చిత్రకూట్‌లో హై అలర్ట్ ప్రకటించారు. వరద బాధితులను రక్షించేందుకు ఐఏఎఫ్ హెలికాప్టర్లు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు.

30 ఆగ, 20262 min read
X Image
international,news

నేపాల్‌లో మళ్లీ వరద బీభత్సం..కళ్లెదుటే కొట్టుకుపోయిన సస్పెన్షన్ బ్రిడ్జి

నేపాల్‌లో మరోసారి భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం ఉదయం త్రిశూలీ నది ఉగ్రరూపం దాల్చడంతో ధాదింగ్, గూర్ఖా జిల్లాలను కలిపే కీలక సస్పెన్షన్ బ్రిడ్జి వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. మరోవైపు అప్పర్ త్రిశూలీ-3ఏ ప్రాజెక్టు వద్ద నీటిమట్టం భారీగా పెరగడంతో సహాయక, రికవరీ చర్యలకు అధికారులు హెలికాప్టర్లను రంగంలోకి దించారు.

30 ఆగ, 20261 min read
AI Image
international,news

వరదల్లో కొట్టుకొచ్చిన బ్యాంక్ సేఫ్.. పగులగొట్టి రూ.92.68 లక్షలు మాయం

నేపాల్‌లో భారీ వరదల నేపథ్యంలో షాకింగ్ క్రైమ్ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. త్రిశూలీ నదిలో కొట్టుకొచ్చిన బ్యాంక్ సేఫ్‌ను పగులగొట్టి నగదు తీసుకున్నారనే ఆరోపణలపై 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.92.68 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో వరదల్లో కొట్టుకుపోయిన మహిళ మృతదేహం నుంచి బంగారు చెవి పోగులు తీసుకున్నారనే ఆరోపణలపై ఇద్దరిని అరెస్ట్ చేశారు.

29 ఆగ, 20261 min read
చుట్టూ ఇళ్లు కొట్టుకుపోయాయి.. ఈ భవనం మాత్రం నిలిచింది! నేపాల్ వరదల్లో అద్భుత దృశ్యం
international,news

చుట్టూ ఇళ్లు కొట్టుకుపోయాయి.. ఈ భవనం మాత్రం నిలిచింది! నేపాల్ వరదల్లో అద్భుత దృశ్యం

నేపాల్‌లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. చుట్టుపక్కల అనేక ఇళ్లు, నిర్మాణాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినా.. ఓ భవనం మాత్రం చెక్కుచెదరకుండా నిలిచింది. అందులో ఉన్నవారు సైతం క్షేమంగా బయటపడటంతో, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

29 ఆగ, 20262 min read
Social Media Image
news,telangana

నేపాల్ వరదల్లో హైదరాబాదీ కుటుంబం గల్లంతు.. రంగంలోకి తెలంగాణ సర్కార్!

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో మానస సరోవర్ యాత్రకు వెళ్లిన హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు గల్లంతయ్యారు. శ్రీధర్ అవ్వారి, దీప్తి, అభినవ్‌ల ఆచూకీ రెండు రోజులుగా తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగి, నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తూ వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది.

29 ఆగ, 20261 min read
Image Credit: Reuters
india,international,national,news

నేపాల్ వరదల్లో విషాదం.. 1,400 మందికి పైగా గల్లంతు.. భారతీయుల జాబితా విడుదల

నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 552 మంది మరణించగా.. 1,400 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 178 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్ పోలీసులు వెల్లడించారు. తాజాగా గల్లంతైన వారి జాబితాను విడుదల చేశారు. అయితే, నేపాల్‌లో సుమారు 320 మంది భారతీయుల ఆచూకీ తెలియడం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

28 ఆగ, 20262 min read
onlinekhabar.com Image
international,news

షాకింగ్ వీడియో.. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన త్రిశూలి బజార్

నేపాల్‌లో భారీ వరదలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. నువాకోట్ జిల్లాలోని త్రిశూలి బజార్‌ను వరద ప్రవాహం ఒక్కసారిగా ముంచెత్తింది. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్న స్థానికులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. రద్దీగా ఉన్న మార్కెట్ క్షణాల్లోనే బురద, శిథిలాల దిబ్బగా మారిన దృశ్యాలు కలచివేస్తున్నాయి.

28 ఆగ, 20261 min read
నేపాల్ వరదల్లో మాజీ కేంద్ర మంత్రి కోడలు గల్లంతు.. 32 మంది యాత్రికుల ఆచూకీ కోసం గాలింపు
india,international,national,news

నేపాల్ వరదల్లో మాజీ కేంద్ర మంత్రి కోడలు గల్లంతు.. 32 మంది యాత్రికుల ఆచూకీ కోసం గాలింపు

నేపాల్‌లో సంభవించిన భారీ మెరుపు వరదలు కైలాస మానససరోవర యాత్రికులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. మాజీ కేంద్ర మంత్రి ముకుల్ రాయ్ కోడలు, మాజీ టీఎంసీ ఎమ్మెల్యే శుభ్రాన్షు రాయ్ భార్య శర్మిష్ట భౌమిక్ రాయ్ సహా కోల్‌కతాకు చెందిన 32 మంది యాత్రికులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు భారత రాయబార కార్యాలయం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.

27 ఆగ, 20261 min read
నేపాల్ వరదల్లో విషాదం.. ఈషా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది గల్లంతు
international,national,news

నేపాల్ వరదల్లో విషాదం.. ఈషా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది గల్లంతు

నేపాల్-టిబెట్ సరిహద్దులో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన ఈషా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది సభ్యులు గల్లంతయ్యారు. దాదాపు 12 గంటలుగా వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని సద్గురు జగ్గీ వాసుదేవ్ వెల్లడించారు. గైరోంగ్ వద్ద ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్న సమయంలోనే వరద ముంచెత్తి ఉండొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

27 ఆగ, 20262 min read
నేపాల్ వ‌ర‌ద‌ల్లో 140 మంది తెలుగు యాత్రికులు గ‌ల్లంతు..!
international,news,andhra-pradesh,telangana,tourism

నేపాల్ వ‌ర‌ద‌ల్లో 140 మంది తెలుగు యాత్రికులు గ‌ల్లంతు..!

నేపాల్‌లో భోటేకోశీ నదికి ఆకస్మికంగా భారీ వరదలు రావడంతో హైదరాబాద్‌ నుంచి పర్యటనకు వెళ్లిన 156 మంది తెలుగు యాత్రికుల బృందంలో 140 మంది ఆచూకీ తెలియకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మరో 16 మంది అనారోగ్య కారణాలతో హోటల్‌లోనే ఉండిపోవడంతో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం కుటుంబసభ్యులు అధికారులను, టూర్ ఏజెన్సీని సంప్రదిస్తున్నారు.

27 ఆగ, 20261 min read
నేపాల్ వరదల్లో 32 మంది కోల్‌కతా యాత్రికులు గల్లంతు.. కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన బృందం
national,india,news

నేపాల్ వరదల్లో 32 మంది కోల్‌కతా యాత్రికులు గల్లంతు.. కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన బృందం

నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల తర్వాత కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన కోల్‌కతాకు చెందిన 32 మంది సభ్యుల బృందం ఆచూకీ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ బృందంలో 30 మంది యాత్రికులు, ఇద్దరు టూర్ మేనేజర్లు ఉన్నారు.

27 ఆగ, 20262 min read
Image Credit: Randhir Jaiswal, MEA, INDIA
international,world,news

నేపాల్‌కు భారత్ 10 టన్నుల మానవతా సాయం.. వరద బాధితులకు అండగా

పాల్‌లో భీకర వరదల నేపథ్యంలో భారత్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. వరద సహాయక చర్యలకు 10 టన్నుల మానవతా సామగ్రి, అత్యవసర మందులను భారత్ పంపించింది. ఈ సాయాన్ని నేపాల్‌లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ అక్కడి సాంస్కృతిక, పర్యాటక, పౌర విమానయాన శాఖ మంత్రి ఖడక్ రాజ్ పౌడెల్‌కు అందజేశారు

27 ఆగ, 20262 min read
నేపాల్‌లో భారీ ఆకస్మిక వరదల ప్రళయం.. 384 మంది గల్లంతు.. 105 మంది భారతీయులు!
international,world,news

నేపాల్‌లో భారీ ఆకస్మిక వరదల ప్రళయం.. 384 మంది గల్లంతు.. 105 మంది భారతీయులు!

నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటేకోషి నదిలో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు నేపాల్ టూరిజం బోర్డు ప్రాథమికంగా వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉండగా.. విదేశీయుల్లో సుమారు 105 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది.

26 ఆగ, 20262 min read
నేపాల్‌లో భారీ ఆకస్మిక వరదలు.. 28 మంది భద్రతా సిబ్బంది గల్లంతు
international,news,world

నేపాల్‌లో భారీ ఆకస్మిక వరదలు.. 28 మంది భద్రతా సిబ్బంది గల్లంతు

నేపాల్‌లో భారీ ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రసువా జిల్లాలో భోటేకోషి నది ఉప్పొంగడంతో భారీగా వరద నీరు దిగువ ప్రాంతాల్లోకి చేరింది. తాజా సమాచారం ప్రకారం 28 మంది భద్రతా సిబ్బంది ఆచూకీ తెలియడం లేదు. మరోవైపు త్రిశూలి నది కూడా ఉప్పొంగడంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

26 ఆగ, 20261 min read
కృష్ణమ్మ పరవళ్లు.. జూరాల, శ్రీశైలానికి భారీ వరద
news,telangana

కృష్ణమ్మ పరవళ్లు.. జూరాల, శ్రీశైలానికి భారీ వరద

జూరాల ప్రాజెక్టుకు 2.20 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి 2.07 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.

7 ఆగ, 20261 min read
గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక
news,telangana

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 53 అడుగులు దాటిన నీటిమట్టం శనివారం ఉదయానికి 55.1 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా, రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

1 ఆగ, 20262 min read
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ షా (Photo: Janavaani)
district,news,telangana

భారీ వర్షాలపై పోలీసుల అప్రమత్తత.. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన రామగుండం కమిషనర్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రాంతం నుంచి డ్రైనేజీ కాలువల ద్వారా వరద నీరు వీర్లపల్లి గ్రామంలోకి చేరడంతో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు.

29 జులై, 20261 min read